Saturday, 25 August 2012

ఆంధ్ర భోజుడు: శ్రీ కృష్ణదేవ రాయలు

ఆంధ్ర భోజుడు: శ్రీ కృష్ణదేవ రాయలు:->

శ్రీ కృష్ణదేవ రాయలు అత్యంత ప్రసిద్ధ విజయనగర సామ్రాజ్య చక్రవర్తి. ఈయన పాలనలో సామ్రాజ్యము అత్యున్నతస్థితికి చేరుకున్నది. కృష్ణరాయలను తెలుగు మరియు కన్నడ ప్రజలు భారతదేశాన్ని పాలించిన గొప్ప చక్రవర్తులలో ఒకడిగా అభిమానిస్తారు. సాహిత్యములో ఈయన ఆంధ్ర భోజునిగా మరియు కన్నడ రాజ్య రమా రమణ గా కీర్తించబడినాడు. ఈయన పాలనను గురించిన సమాచారము పోర్చుగీసు సందర్శకులు డొమింగో పేస్ మరియు న్యూనిజ్‌ ల రచనల వలన తెలియుచున్నది. రాయలకు ప్రధాన మంత్రి తిమ్మరుసు. శ్రీకృష్ణదేవరాయలు సింహాసనం అధిష్ఠించడానికి తిమ్మరుసు చాలా దోహదపదడినాడు. కృష్ణరాయలు తిమ్మరుసును పితృసమానునిగా గౌరవించి "అప్పాజీ" (తండ్రిగారు) అని పిలిచేవాడు.

కృష్ణదేవ రాయలు, తుళువ నరస నాయకుడు, నాగలాంబల (తెలుగు ఆడపడుచు) కుమారుడు. ఇతను ఇరవై సంవత్సరాల వయసులో ఫిబ్రవరి 4, 1509న విజయనగర రత్నసింహాసనాన్ని అధిష్ఠించినాడు. ఇతని పట్టాభిషేకానికి అడ్డుగానున్న అచ్యుత రాయలు నూ, వీర నరసింహ రాయలునూ, అనుచరులనూ తిమ్మరుసు సుదూరంలో ఉన్న దుర్గములలో బంధించినాడు.


రాయలు విజయనగరాధీశులందరిలోకీ చాలా గొప్పవాడు, గొప్ప రాజనీతిజ్ఞుడు, సైనికాధికారి, భుజబల సంపన్నుడు, ఆర్ధిక వేత్త, మత సహనము కలవాడు, వ్యూహ నిపుణుడు, పట్టిన పట్టు విడువని వాడు, కవి పోషకుడు, రాజ్య నిర్మాత మొదలగున్న సుగుణాలు కలవాడు. ఇతను దక్షిణ భారతదేశం మొత్తం ఆక్రమించినాడు.

సంస్కృత సాహిత్యంలో కవిపండిత పోషకుడు భోజ రాజు ఉన్నాడు. తెలుగులో ఆయనంతటి వాడు ఆయనే అనే భావనతో ఆయనను ఆంధ్ర భోజుడు అని పిలిచేవారు. భోజరాజు ముఖం చూస్తే ఎలాంటి వాడికైనా కవిత్వం వస్తుందని అనేవారు. అలాగే దక్షిణాదిలో ఆయన సముఖానికి వచ్చి సాహిత్యాన్ని పాండి త్యాన్ని ప్రదర్శించి బహుమానాలు అందుకున్న వారెందరో ఉన్నారు. రణరంగంలో వీరవిజృంభణ చేసిన విధంగానే సాహిత్యరంగంలోనూ విజృంభణ చేసిన ఘనత ఆయనకు ఉంది.

కృష్ణదేవరాయలు స్వయంగా కవిపండితుడు కావడంతో ఇతనికి సాహితీ సమరాంగణ సార్వభౌముడు అని బిరుదు. ఈయన స్వయంగా సంస్కృతంలో జాంబవతీ కళ్యాణము, తెలుగులో ఆముక్తమాల్యద లేక గోదాదేవి కథ అనే గ్రంథాన్ని రచించాడు.

తెలుగదేల యన్న దేశంబు తెలుగేను
తెలుగు రేడ నేను తెలుగొకొండ
ఎల్ల జనులు వినగ ఎరుగవే బాసాడి
దేశభాష లందు తెలుగు లెస్స

అన్న పలుకులు రాయలు రాసినవే! రాయల ఆస్థానమునకు భువన విజయము అని పేరు. భువనవిజయము లో అల్లసాని పెద్దన, నంది తిమ్మన, ధూర్జటి, మాదయ్యగారి మల్లన (కందుకూరి రుద్రకవి), అయ్యలరాజు రామభద్రుడు, పింగళి సూరన, రామరాజభూషణుడు (భట్టుమూర్తి), తెనాలి రామకృష్ణుడు అనే ఎనిమిది మంది కవులు ఉండేవారని ప్రతీతి. వీరు అష్టదిగ్గజములు గా ప్రఖ్యాతి పొందారు.

Monday, 20 August 2012

Kapu Reservations

prasthutham kaapu, telaga, balija, ontari kulasthulaku reservations kalpincaliante B.C commissoion dwaraney sadhyamani chebuthunna e governments 1956, 1966 lo a vidhaymayina commission orders lekundaney telaga, balija, ontari kulalanu anagarina vargalanundu veru chesi, Bharatha Rajyana Nirmatha Dr.B.R.Ambedkar kapu kulalaku ligeal ga ichina hakkulanu kalarasindhi.
Ummadi Madras State lo unna anagarina vargalu 86, telangana(Hyderabad state)lo unna 60 anagarina vargaluga 86+60+146. kulalu anagarina vargaluga 1956 varaku, kapu, telaga, balija, ontari and kostha kaapulu, gajula balija, thurpukaapu, munnuru kapu modhaluga ga kulalu e 146 kulala vargikarana lo unnaru.......ante manam separate Andhra Pradesh vachina tharavatha andharu anandham lo unte kapulu mathram kolpoyina reservations badhalo unnaru...a okkari prayojanala kosamo mana reservations pogotukunnam......vatini marala manam sadinchukovali...
British Govt unappudu kuda manam reservations catagory lone unnam...kani ippudu kapulu etu vaypu unte a govt. adhikaram loki vasthundhi ani chepukuntunna manam ipativaraku reservations ni sadinchukolekapovatam nijamga baadhakaram.....mana kulam vallu jaruguthunna anyayanni gurthincha galgali

Survey On Kapu People


10 lakhs released to B.C commission

కాపుల సర్వేకు ఓకే
బీసీ కమిషన్‌కు రూ.10 లక్షలు విడుదల

హైదరాబాద్, మార్చి 16 : కాపుల ఆర్థిక, సామాజిక స్థితిగతులపై అధ్యయనానికి సర్కారు పచ్చజెండా ఊపింది. కాపు, బలిజ, ఒంటరి, తెలగ కులాలపై సర్వే చేసేందుకు బీసీ కమిషన్‌కు రూ.10 లక్షలు కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నిజానికి సర్వేకు రూ.40 లక్షలు కేటాయించాలని బీసీ కమిషన్ ప్రభుత్వాన్ని కోరింది. అయితే, ప్రభుత్వం తొలి విడతగా 10 లక్షలను విడుదల చేసిందని అధికార వర్గాలు చెబుతున్నాయి.

కాపులను బీసీ జాబితాలో చేర్చాలని, తమ వెనుకబాటుపై సర్వేకు అనుమతించాలని ఆ సామాజికవర్గానికి చెందిన వారు గత కొన్నేళ్లుగా పోరాటం చేస్తున్నారు. దీనిపై హైకోర్టును కూడా ఆశ్రయించారు. సర్వేకు అనుమతించాలని ప్రజారాజ్యం అధ్యక్షుడు చిరంజీవి ప్రత్యేకంగా ప్రభుత్వాన్ని కోరారు. కాంగ్రెస్‌లో పీఆర్పీ విలీన నిర్ణయానికి ముందే ఈ విన్నపం చేశారు. మంత్రి బొత్స సత్యనారాయణ కూడా ఈ అంశంపై ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చారు.

ఇటీవల ఆయన ముఖ్యమంత్రిని కలిసి సర్వేకు నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. వెంటనే సర్వే చేపట్టేలా ఆదేశించాలని కోరారు. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిణామాల నేప«థ్యంలో నెలన్నరపాటు ఈ అంశంపై నాన్చిన ప్రభుత్వం తాజాగా నిధులు విడుదల చేసింది. దీంతో... కాపుల డిమాండ్‌కు ఓకే చెప్పినట్లయింది. కాపు, ఒంటరి, తెలగ, బలిజ కులాల సామాజిక స్థితిగతులు, వెనుకబాటుతనం, ఆర్థి కాభివృద్ధి, తదితర అంశాలపై అధ్యయనం చేసేందుకు ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎకనమిక్ స్టడీస్ సంస్థ ఇదివరకే ముందుకొచ్చింది.

ఇప్పుడు సర్వే బాధ్యతలను కూడా ఈ సంస్థకే అప్పగించవచ్చని సమాచారం. దీనిపై బీసీ సంక్షేమశాఖ ప్రత్యేకంగా ఉత్తర్వులు జారీ చేయాల్సి ఉంది. సర్వేను ఏ సంస్థకు అప్పగించాలి? ఎప్పటిలోగా సర్వేను పూర్తి చేయడానికి ఎంత గడువు ఇవ్వాలి? నివేదికను ఎప్పుడు సమర్పించాలి? అనే విషయాలపై ఉత్తర్వులు వెలువరించాల్సి ఉంటుంది.
indian inistitute of economic studies అనీ సంస్థ మొత్తం 46 lakhs అడిగితే ముఖ్యమంత్రి గారు కాపుల మీద దయతో 10lakhs ఇపించ్చారు..

Representaion to B.C commision 1

28th jan 2011...

                             giving representation to B.C commission regarding reservations for kapu in hyd at babu jagjeevanram bhavan,kothapet.

--
regards,
sagar kadavakollu.