కాపుల సర్వేకు ఓకే
బీసీ కమిషన్‌కు రూ.10 లక్షలు విడుదల
హైదరాబాద్, మార్చి 16 : కాపుల ఆర్థిక, సామాజిక స్థితిగతులపై అధ్యయనానికి సర్కారు పచ్చజెండా ఊపింది. కాపు, బలిజ, ఒంటరి, తెలగ కులాలపై సర్వే చేసేందుకు బీసీ కమిషన్‌కు రూ.10 లక్షలు కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నిజానికి సర్వేకు రూ.40 లక్షలు కేటాయించాలని బీసీ కమిషన్ ప్రభుత్వాన్ని కోరింది. అయితే, ప్రభుత్వం తొలి విడతగా 10 లక్షలను విడుదల చేసిందని అధికార వర్గాలు చెబుతున్నాయి.
కాపులను బీసీ జాబితాలో చేర్చాలని, తమ వెనుకబాటుపై సర్వేకు అనుమతించాలని ఆ సామాజికవర్గానికి చెందిన వారు గత కొన్నేళ్లుగా పోరాటం చేస్తున్నారు. దీనిపై హైకోర్టును కూడా ఆశ్రయించారు. సర్వేకు అనుమతించాలని ప్రజారాజ్యం అధ్యక్షుడు చిరంజీవి ప్రత్యేకంగా ప్రభుత్వాన్ని కోరారు. కాంగ్రెస్‌లో పీఆర్పీ విలీన నిర్ణయానికి ముందే ఈ విన్నపం చేశారు. మంత్రి బొత్స సత్యనారాయణ కూడా ఈ అంశంపై ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చారు.
ఇటీవల ఆయన ముఖ్యమంత్రిని కలిసి సర్వేకు నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. వెంటనే సర్వే చేపట్టేలా ఆదేశించాలని కోరారు. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిణామాల నేప«థ్యంలో నెలన్నరపాటు ఈ అంశంపై నాన్చిన ప్రభుత్వం తాజాగా నిధులు విడుదల చేసింది. దీంతో... కాపుల డిమాండ్‌కు ఓకే చెప్పినట్లయింది. కాపు, ఒంటరి, తెలగ, బలిజ కులాల సామాజిక స్థితిగతులు, వెనుకబాటుతనం, ఆర్థి కాభివృద్ధి, తదితర అంశాలపై అధ్యయనం చేసేందుకు ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎకనమిక్ స్టడీస్ సంస్థ ఇదివరకే ముందుకొచ్చింది.
ఇప్పుడు సర్వే బాధ్యతలను కూడా ఈ సంస్థకే అప్పగించవచ్చని సమాచారం. దీనిపై బీసీ సంక్షేమశాఖ ప్రత్యేకంగా ఉత్తర్వులు జారీ చేయాల్సి ఉంది. సర్వేను ఏ సంస్థకు అప్పగించాలి? ఎప్పటిలోగా సర్వేను పూర్తి చేయడానికి ఎంత గడువు ఇవ్వాలి? నివేదికను ఎప్పుడు సమర్పించాలి? అనే విషయాలపై ఉత్తర్వులు వెలువరించాల్సి ఉంటుంది.

indian inistitute of economic studies అనీ సంస్థ మొత్తం 46 lakhs అడిగితే ముఖ్యమంత్రి గారు కాపుల మీద దయతో 10lakhs ఇపించ్చారు..
No comments:
Post a Comment